| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share

బ్రిటన్ లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

 

లండన్, అక్టోబర్ 31 (ప్రత్యేక ప్రతినిధి) బ్రిటన్ లోని  తెలుగువారంతా భారతీయ సంస్కృతిని గుర్తుచేసుకుంటూ అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక నీస్డెన్ స్వామినారాయణ్ మందిరంలో యునైటెడ్ కింగ్డం తెలుగు అసోసియేషన్ (యుక్తా) నిర్వహించిన దీపావళి వేడుకల్లో సుమారు 250 మంది ప్రవాస ఆంధ్రులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన యుక్తా ప్రెసిడెంట్ కాజా ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రవాసులలో ప్రప్రథమంగా బాణా సంచా ప్రదర్శన నిర్వహించిన ఘనత యుక్తాదే అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యుడు హర్ష కుమార్ మాట్లాడుతూ దేశం కాని దేశంలో తెలుగువారు తమ సంప్రదాయాలు మర్చిపోకుండా పెద్ద పీత వేయటం చాలా గొప్ప విషయం అని అన్నారు. సభకు విచ్చేసిన వారందరినీ సంక్రాంతికి కోనసీమ పండుగకి అమలాపురం రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఈ సందర్భంగా యురప్ లోని తెలుగువారి గుండె గొంతుకగా పిలువబడుతున్న తొలి తెలుగు రేడియో "తెలుగువాణి" ని ప్రారంభించారు.  


ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఈలింగ్ సౌతాల్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ, లండన్ నెహ్రూ సెంటర్ డిప్యుటీ డైరెక్టర్ గౌరీ శంకర్ విచ్చేశారు. పురాణ కాలం నుంచి మంచి చెడు మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. రావణ సంహార ఘట్టం కూడా ఉగ్రవాద నిరోధకం లాంటిదే అని అన్నారు. తనను ఆదరిస్తున్న ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు తోడ్పాటునిస్తూ వారికి అండగా ఉండటం వంటి ఉపకరించే ప్రయత్నాలతో యుక్తా అందరి మన్ననలు పొందుతోందని, ఇటువంటి సత్కార్యాలకు తనను కూడా భాగస్వామిని చేయవలసిందిగా గౌరీ శంకర్ కోరారు. దివ్య వెంకటేష్ భరతనాట్య ప్రదర్శన, కళ్యాణి గానలహరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణా సంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
 



































































 

Latest Telugu Cinema News