ఇటీవల తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చిన భామ శ్రద్ధాదాస్. తమిళ చిత్రాల్లోనూ యాడ్స్‌లోనూ బాగా నటించేస్తుంది. ఇటీవలే అక్షయ తృతీయ సందర్భంగా ఓ ఆభరణాల దుకాణానికి హాజరైంది. ఒళ్ళంతా ఆభరణాలు ధరిస్తూ.... ఇలాగే ఈ ఏడాది సినిమాలు కూడా రావాలని ఆకాంక్షించింది.
మంగళవారంనాడు నందిప్రొడక్షన్స్ పతాకంపై పద్మాలయ మల్లిబాబుగా పిలువబడే మల్లికార్జునరావు కొడుకు శివ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ దగ్గర పనిచేసిన వెంకన్నబాబు దర్శకుడుగా మారాడు. ఈ చిత్ర కథ తనకెంతో బాగా నచ్చిందని శ్రద్దాదాస్ చెప్పింది.
వీపుభాగాన్ని చూపిస్తున్న స్టిల్స్ ఈ చిత్రం ఫొటోసెషన్స్‌కు తీశారు. చిత్రంలో నాది గ్లామర్‌తో కూడిన పాత్ర. ఈ పాత్ర ఎంతగానో నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను. కొంచెం శృంగారంకూడా మిళితమై ఉంటుందని చెప్పింది. ఈ సినిమాతో తెలుగులో మాట్లాడగలననే కాన్ఫిడెన్స్ బాగా వచ్చేసిందని శ్రద్ధాదాస్ తెలిపింది. Published Date: 2012-04-24 08:02:52 GMT
|