| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

సూరి హత్య వెనుక జగన్ బంధువుల హస్తం

 

మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి(సూరి) హత్య విషయంలో వైఎస్ జగన్ బంధువుల హస్తం ఉన్నదని ఎమ్మెల్యే వీరశివా రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి వాస్తవాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

మంగలి కృష్ణ, సూరి హంతకుడు భాను కిరణ్, జగన్‌ల సంబంధాలపై విచారణ జరిపించాలి వీరశివారెడ్డి కోరారు. కడప భూ దందాల విషయంలోనూ జగన్, భానుల ప్రమేయం ఉందని వీరశివారెడ్డి ఆరోపించారు.

ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీ సైతం జగన్ మోహన్ రెడ్డిపై విరుచకుపడింది. పరిటాల రవి హత్యలో జగన్ ప్రమేయం ఉందని ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. నేరాలు చేయడంలో జగన్‌కు మించినవారెవరూ లేరని అన్నారు.

Published Date: 2012-04-26 07:09:55 GMT

Related News