మొత్తం ఏడు రోజులపాటు అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డిని ఎంత ప్రశ్నించినప్పటికీ ఫలితం రాలేదనీ, కనుక జగన్‌కు నార్కో పరీక్షకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై వాదోపవాదాలు జరిగాయి.
తొలుత సీబీఐ వాదిస్తూ... అక్రమాల గురించి జగన్‌ను ఎంత ప్రశ్నించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని తెలిపింది. అక్రమాల గురించి ఏదడిగినా విజయసాయిరెడ్డి పేరో.. మరొకరి పేరో చెపుతూ... తనకేమీ తెలియదని తేటతెల్లం చేశారనీ, ఈ దశలో తమకు నార్కో పరీక్ష ఒక్కటే పరిష్కార మార్గమని కోర్టుకు విన్నవించింది.
అనంతరం జగన్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ... నార్కో పరీక్షలను వైద్యశాస్త్రం పూర్తిస్థాయి ఫలితాలను నిర్థారించలేదనీ, కనుక ఆ పరీక్షలు చేసేందుకు వీలు లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదప్రతివాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. Published Date: 2012-06-11 07:28:51 GMT
|