| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

శంకర్ "రోబో"లో దోమను చూసి రాజమౌళి "ఈగ"ను తీశాడా...?!!

 

రాజమౌళి తీసిన ఈగ సినిమా గురించి రకరకాలుగా కామెంట్లు విన్పిస్తున్నాయి. కొందరు చాలా బాగుందని చెబితుంటే మరికొందరు శంకర్‌ తీసిన 'రోబో'లో దోమ సీన్‌ ఇన్‌స్పిరేషన్‌తో రాజమౌళి ఈగ తీశాడని అంటున్నారు. ఇంకొందరు కథేం కొత్తదికాదు. కామంతో రగిలిపోయే వ్యక్తి హీరోయిన్‌ను ప్రేమించి పొందాలనుకుంటాడు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన చంద్రముఖి హిట్‌ అయింది. అందులో విలన్‌కు బాగా పేరు వచ్చింది. అలాగే ఈగలో కూడా కన్నడ నటుడు సుదీప్‌ కూడా కామంతో సమంతాపై రగిలిపోతుంటాడు. ఆ క్రూరత్వాన్ని బాగా పోషించాడు. ఇలాంటివి ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారంటూ... విమర్శిస్తున్నారు.

ఫిలింగనర్‌లో మాత్రం ఈగ సినిమాను కేవలం పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని చెబుతున్నారు. రాజమౌళి కూడా ఈగ పిల్లలకు బాగా నచ్చుతుందని రిలీజ్‌కు ముందు చెప్పాడు కూడా. ఏదిఏమైనా .. ఈ చిత్రం బాగానే రన్నింగ్‌లో ఉంది. ఈ దెబ్బతో కొన్ని సినిమాలు కూడా వారంపాటు వాయిదా పడ్డాయి. అయితే ఆదివారంనాడే ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు శంకర్‌ చూసి బాగా స్పందించారు. చెన్నైలోని థియేటర్‌లో చూసి విజిటర్స్‌ బుక్‌లో 'సూపర్‌ ఫిల్మ్‌' అని మెసేజ్‌ రాశాడు.

ఇటీవలే మహేష్‌బాబు కూడా చూసి ఇప్పటివరకు వచ్చిన గ్రేట్‌ ఫిల్మ్‌లో ఇదొకటంటూ ట్వీట్‌ చేశాడు. ఇక మిగిలిన ప్రముఖ దర్శకులు, హీరోలు కూడా ట్విట్టర్‌లో రాజమౌళి టేకింగ్‌ను ప్రశంసిస్తూ రాశారు. అందరికంటే బాగా మెచ్చుకుంది మాత్రం ప్రతినాయకుడు సుదీప్‌ను. ప్రముఖ హీరోలు తమ చిత్రాల్లో బుక్‌ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఎటొచ్చీ పేరు రానిది నానికి మాత్రమే.

Published Date: 2012-07-10 07:56:31 GMT

Related News