| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

శ్రీరాముడిగా సూర్య, రావణాసురుడిగా మోహన్‌బాబు!

 

లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బేనర్‌పై ఎన్నో చిత్రాలు నిర్మించిన మోహన్‌బాబు ఈ మధ్య ఆ బాధ్యతను తన కుమార్తె లక్ష్మీప్రసన్నకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ బేనర్‌లో డిఫరెంట్‌ మూవీలు చేయాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చేసిన సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

'ఊకొడతార ఉలిక్కిపడతారా'తోపాటు విష్ణు చిత్రం కూడా రెడీగా ఉన్నాయి. వీటి కోసం అద్భుతమైన సెట్‌ను రామానాయుడు సినీ విలేజ్‌ పరిసర ప్రాంతాల్లో వేశారు. ఇప్పుడు అక్కడే రావణుడిగా నటిస్తున్న మోహ్‌బాబు చిత్రం షూటింగ్‌ కూడా జరగడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నటుడు సూర్య రాముడిగా కన్పించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయింది. మరి సీత పాత్ర ఎవరో తెలియాల్సి వుంది. ఇప్పటికే నయనతార సీతగా కన్పించింది. మరి ఆమె నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Published Date: 2012-07-12 15:30:47 GMT

Related News