| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

పదవుల విషయంలో రాహుల్ - జగన్‌లకు పోలికే లేదు

 

పదవులను చేపట్టడంలో రాహుల్ గాంధీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోల్చకూడదని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. జగన్ కేవలం పదవులకోసమే పలు విధాలుగా తమ వైఖరిని మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాడని అన్నారు.

రాహుల్ గాంధీ అలా కాదనీ, ప్రజల సాధకబాధకాలను తెలుసుకోవాలని రెండుసార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా స్వీకరించలేదని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పదవులను త్యాగం చేసిన మహానాయకులు రాహుల్ గాంధీతో జగన్ మోహన్ రెడ్డిని పోల్చలేమని అన్నారు.

2014 నాటికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సమాయత్తమవుతురాన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తానని అంటున్నారు కనుక ఆయన కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు చేపడతారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

Published Date: 2012-07-19 05:40:06 GMT

Related News