పెండ్లయ్యాక శుభలేక రాస్తానని రామ్ చరణ్ అంటున్నాడు. ఈమధ్య రామ్ చరణ్ తన తండ్రి చిత్రాల్లోని పాటలను రీమిక్స్ చేసేస్తున్నాడు. మొన్ననే 'రచ్చలో "వానవాన వెల్లువాయే.." పాటను చేయగా, తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో 'శుభలేఖ రాసుకున్న కలయో నిజమో..' అంటూ పాడుతున్నారు.
కాజల్ హీరోయిన్‌గా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో ఈ పాటను వాడనున్నారు. ఈ నెల 21 నుంచి కోల్‌కతాలో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. యాక్షన్‌తో పాటు పాటను కూడా అక్కడ చిత్రీకరించనున్నారు.
చిరంజీవి నటించిన 'కొండవీటిదొంగ'లో ఈ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారు. ఇంతకుముందు ఘరానామొగుడులో 'బంగారు కోడిపెట్ట'ను మగధీరలో రీమిక్స్ చేశాడు. నిర్మాత మాట్లాడుతూ,రీమిక్స్ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయన్నారు. Published Date: 2012-07-20 05:19:19 GMT
|