| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

సోనాక్షి చెప్పడంతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ ప్రభుదేవా!

 

కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా బాలీవుడ్ సుందరాంగి సోనాక్షి సిన్హా చెప్పిన మాట వింటున్నాడట. నయనతారతో ప్రేమాయణానికి బ్రేక్ పడటంతో హిందీ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్న ప్రభుదేవా.. తాజాగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు.

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా "రౌడీ రథోర్" అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ద్వారా ప్రభుదేవాకు సోనాక్షి మరింత క్లోజ్ అయ్యిందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ నేపథ్యంలో రౌడీ రథోర్ హిట్ కొట్టడంతో మరో హిందీ సినిమా‌కు దర్శకత్వం వహించాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నాడు.

ఈ హిందీ సినిమాపై సినీ వర్గాల్లో ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం ఇచ్చేందుకు కూడా ప్రభుదేవాకు టైమ్ లేదు. దీంతో ప్రభుదేవాను స్నేహితులంతా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారట. కానీ స్నేహితులు చెప్పినా వినిపించుకోని ప్రభుదేవా సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పిన వెంటనే ఆ పని చేసేశాడట.

అయితే ఈ వార్తలను ప్రభుదేవా ఖండించాడు. సమయం లేకపోవడంతోనే ఇప్పటివరకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయలేదన్నాడు. సోనాక్షి చెప్పడంతో ట్విట్టర్ ఓపెన్ చేయలేదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. కాగా సోనాక్షి సిన్హా మాత్రం ట్విట్టర్ ద్వారా ప్రభుదేవాను ప్రశంసలతో ముంచెత్తింది.

Published Date: 2012-07-24 07:40:00 GMT

Related News