| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

రాజమౌళికి ఎన్నారైలు మరోసారి వార్నింగ్‌

 

ఈసారైన చక్కగా తెలుగు కథను సినిమా తీయ్‌.. ఏవో కాపీలు కొట్టేసి... ప్రతాపం చూపడం కాదని ఎన్‌.ఆర్‌.ఐ.లు మళ్ళీ రాజమౌళిపై సోమవారం ఘాటుగా స్పందిచారు. ఇటీవలే తమ ఈగ సినిమాను విదేశీ భారతీయులు నెట్‌లో పైరసీ చేస్తున్నారనీ, వారి గ్రీన్‌కార్డ్‌ రద్దు చేసే అవకాశాన్నికూడా ఆలోచిస్తానని ట్విట్టర్‌లో పెట్టిన రాజమౌళికి వారు అంతే ఘాటుగా స్పందించారు.

అయితే ఈసారి .. కాపీకి, స్ఫూర్తికి తేడా ఉంది. నాది స్ఫూర్తి అంటూ రాజమౌళి మరోసారి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో వారు సోమవారం నాడు 'ఈగ' సినిమా చిత్రం ఒరిజినల్‌ 'బీ స్టోరీ' అనీ, దానిలో ఇన్ని సీన్లు వాడేసుకున్నారంటూ... వారు చెప్పడంతో రాజమౌళి అవాక్కయ్యాడు.

మీ దర్శకత్వం ప్రతిభ గొప్పదే కానీ... నోటికొచ్చినట్లు మాట్లాడకండని అంటూ తిట్టిపోశారు. తాజాగా ప్రభాస్‌తో తీయబోతున్న చిత్రంలోనైనా ఒరిజినల్‌ ఐడియాస్‌తో సినిమా చేస్తే బాగుంటుందని సూచించారు. లేనిపోనిదాన్ని కెలుక్కోవడమంటే ఇదేనేమో...?!!

Published Date: 2012-07-30 15:20:40 GMT

Related News