''నా పేరు నాగార్జున. ఇక నుంచి కూడా అలాగే పిలవండి. సాయి నాగార్జున, నాగ్‌సాయి.. అంటూ పేర్లతో పిలవొద్దు..' అంటూ నాగార్జున తన అభిమానులనుద్దేశించి చెప్పారు. సోమవారం రాత్రి 'శిరిడీ సాయి' చిత్ర ఆడియో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. నాలుగు రోజుల ముందు షిరిడీ సాయి సన్నిధిలో ఆడియో సీడీని ఉంచి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకోను. ఎందుకంటే.. బాబా ఎప్పుడూ హిట్టే.. ఆయన కోట్లాది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వారి మనసులకు తట్టేలా కె.రాఘవేంద్రరావు అద్భుతంగా తీశారు. ఈ పాత్ర పోషించడం అదృష్టం.
ఈ సినిమా ఒప్పుకున్నాక ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎదుటివారి సంతోషమే మన సంతోషం అని అర్థమైంది. అమ్మ పోయాక నాన్న మొహంలో నవ్వుచూడలేదు. నేను ఈ చిత్రం చేస్తున్నప్పుడు నాన్నలో ఆనందాన్ని చూశాను. ఆయన నవ్వు నాకో వరం.. అని అన్నారు. Published Date: 2012-07-31 12:54:34 GMT
|