| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

కామెడీ హీరోలంటే హీరోయిన్లు ఎందుకు భయపడుతున్నారు!

 

కథానాయికలు తెలుగువారు కాకపోయినా... బాలీవుడ్‌, కోలివుడ్‌ నుంచి వచ్చినవారెవరైనా.. ప్రముఖ హీరోలతో నటించడానికి ఒప్పుకుంటున్నారు కానీ సెకండ్‌గ్రేడ్‌ హీరోలతో చేయడానికి ససేమిరా అంటున్నారు. ఈ బాధను గతంలో హీరో శివాజీ కూడా వెళ్లగక్కాడు.

''నా పక్క ఏ హీరోయిన్ కూడా నటించనంటోంది.. అదేమిటో.. హీరో శివాజీ అంటే.. వాడా... సక్సెస్‌ లేని హీరో.. అంటూ కొందరు మేనేజర్లే చెప్పేస్తున్నారంటూ... ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆయన సినిమాలు అరకొర ఉన్నా ఎవరో ఒక హీరోయిన్‌ను తీసుకొచ్చి కన్నడ, తమిళలోనూ ఒకటి అర సినిమాల్లో చేసిందని చెపుతున్నారు.

ఇప్పుడు ఆ బాధను సునీల్‌ అనుభవిస్తున్నాడు. కమేడియన్‌గా ప్రవేశించి, హీరోగా లాంచ్‌ కావడానికి సిక్స్‌ప్యాక్‌ కూడా తెచ్చుకున్నాడు సునీల్‌. అయతే అతనికి హీరోయిన్ల కొరత ఏర్పడింది. అతని పక్కన ఏ హీరోయిన్‌ కూడా నటించడానికి ఆసక్తి చూపడంలేదు. దాంతో సునీల్‌తో సినిమా అంటే బిజినెస్‌ బాగున్నా.. హీరోయిన్స్‌ సమస్య వచ్చిపడింది దర్శక నిర్మాతలకు. దాంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి... కొత్తహీరోయిన్లకు కట్టబడెతున్నారు.

ఈ రకంగా కాస్త బడ్జెట్‌ కూడా కంట్రోల్‌ అవుతుంది. ఎందుకని సునీల్‌కు హీరోయిన్లు దొరకడంలేదు. వ్యక్తిగతంగా బ్యాడా? అంటే అదీకాదు. కమేడియన్‌ హీరోగా చేస్తే... ఇకపై ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావని ఇండస్ట్రీలో అపోహ నెలకొంది. ఇక్కడే కాదు తమిళంలో వడివేలు సరసన ఓ చిత్రంలో శ్రియ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి.


దాంతో తెలుగులో కూడా ఇదే ట్రెండ్‌ ఉంది. చేసేది లేక సునీల్‌తో ఫేడవుట్‌ అయిన హీరోయిన్స్‌ లేదా క్రేజ్‌లేని హీరోయిన్లను పెట్టుకోవాల్సి వస్తుంది. అందాలరాముడులో ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌ సిద్ధమై ఫేడవుట్‌ అయిన ఆర్తిఅగర్వాల్‌ను పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 'అప్పల్రాజు..' సినిమాలో ఆయనతో ఆడిపాడే హీరోయనేలేదు. పేరుకు కలర్స్‌ స్వాతి ఉన్నా.. వారిద్దరిమధ్యా రొమాన్స్‌ కుదరలేదు. ఆ చిత్రం ఫెయిల్‌ అయ్యాక.. లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని 'పూలరంగడు'లో ఇషాచావ్లా అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు. అంతకుముందే ప్రేమకావాలి చిత్రంతో ఆదితో పరిచయమైంది. ముందుగా ఆ పాత్రను త్రిషను అడిగారు. కానీ త్రిష ఒప్పుకోలేదు. పైగా ఎక్కువ పారితోషికం అడిగేసరికి..ఇదేదో కావాలని చెప్పినట్లుందని నిర్మాత గ్రహించేసేశాడు.

తాజాగా ఉదయ్‌ శంకర్‌ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా చిత్రం తయారుకాబోతుంది. అందులో కాస్త పేరున్నహీరోయిన్లను ట్రై చేశారు. వారు డేట్స్‌ ఖాలీ లేవనడంతో..కొత్త అమ్మాయి కోసం వేట మొదలుపెట్టారు. ఇదికాకుండా.. నాగచైతన్య, సునీల్‌ కలిసి తమిళ చిత్రం 'వేట్టై' చిత్రం రీమేక్‌లో నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ప్రముఖ హీరోయిన్‌ ఉంటే.. సునీల్‌ పక్కన పేరులేని అక్షను ఫైనలైజ్‌ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందని విశ్లేషిస్తే... ఓ ప్రముఖ నిర్మాత ఇలా చెబుతున్నాడు. కామెడీ ఆర్టిస్టు తీపిలాంటివాడు. దాన్ని తినకుండా ఉంటేనే భవిష్యత్‌లో సుగర్‌ వ్యాధి లాంటివి రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇక్కడా అంతేనంటూ.. బదులిచ్చాడు.

Published Date: 2012-08-01 07:38:57 GMT

Related News