| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

ఆచార్యకు నో బెయిల్ - ఎమ్మార్ కేసులో కోనేరుకు బెయిల్!

 

ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు బెయిల్ మంజూరు చేసేందుకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అదేసమయంలో ఎమ్మార్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో మూడో నిందితుడుగా ఉన్న బీపీ ఆచార్యకు తనకు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టి వేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఈయన గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ అనంతరం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

మరోవైపు.. ఎమ్మార్ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్‌కు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల బాండ్లు పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది. కోనేరు ప్రసాద్ రాష్ట్రం విడిచివెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది.

Published Date: 2012-08-02 09:39:36 GMT

Related News