చిరంజీవి తన 150 చిత్రాన్ని ఎలా చేయాలి? ఎటువంటి కథ చేయాలని నీళ్లు నలుతున్నాడు. ఈలోపే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ నందమూరి బాలకృష్ణ ఓ పొలిటికల్ స్టోరీ నేపథ్యంతో సినిమాలో నటిస్తున్నారు. పార్వతిమెల్టన్ కథానాయిక. చిత్రం పేరు 'శ్రీమన్నారాయణ'. షూటింగ్ పూర్తయింది.
దర్శకుడు రవికుమార్ చావలి. నిర్మాత రమేష్ పుప్పాల.. కథగురించి చెబుతూ.. పాలన కొంతమంది చేతుల్లోనే ఉంది. దేశ భవిష్యత్‌ను వారే నిర్ణయిస్తున్నారు. ఇది రాజుల కాలం నుంచి వస్తుంది. మద్యం, డబ్బు ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తుంది. వీటి మధ్య ప్రజలు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ఒక్క పాత్రికేయుడే దాన్ని సరైన దిశగా నడింపించగలడు. ఆ పనిని బాలకృష్ణ పోషించారని చెప్పారు. అదిరిపోయే డైలాగ్స్‌తో బాలయ్యబాబును గొప్పరేంజ్‌కు తీసుకెళ్తుందనినమ్మకముందని అన్నారు. ఈనెలలో ఆడియోను విడుదలచేస్తామన్నారు. Published Date: 2012-08-06 12:10:35 GMT
|