| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

నీలిమ డెత్ ఎంక్వైరీ ఆపేయమన్న ఫ్యామిలీ... కేసు మెడకు చుట్టుకుంటుందనా..?!!

 

ఇన్ఫోసిస్ ఉద్యోగి నీలిమ మిస్టరీ డెత్‌పై జరుగుతున్న విచారణను నిలుపుదల చేయాలంటూ నీలిమ భర్త, కుటుంబ సభ్యులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ తిరుమలరావును అభ్యర్థించారు. చనిపోయిన నాడు నీలిమ చావుకు కార్యాలయానిదే బాధ్యత అనీ, కార్యాలయంలోనే ఏదో జరిగిందని ఆమె తల్లి ఆరోపించారు. కేసును లోతుగా విచారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు.. రాయదుర్గం పోలీసు స్టేషనులో కేసు కూడా నమోదు చేశారు. కానీ నీలిమ మిస్టరీ డెత్ వెనుక కారణాలను పోలీసులు ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా తవ్వుతున్నారు. తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు బయల్పడుతున్నాయి. ఈ వ్యవహారం తిరిగితిరిగి కుటుంబ సభ్యుల వద్ద ఆగుతుందా..? అనే సందేహాలు సైతం తలెత్తుతున్నాయి.

నీలిమ ఆత్మహత్యకు పాల్పడే ముందు భర్త సురేష్‌కు ఓ మెయిల్ పంపింది. ఆ మెయిల్ సారాంశాన్ని చూస్తే.. భర్త ఆలోచనలకు తన ఆలోచనలకు పొంతన కుదరదనీ, తనకు నచ్చినట్లు మాత్రమే ఉంటాను కనుక భర్తతో పొసగదు కనుక తానీ నిర్ణయం తీసుకుంటున్నానని జోడించింది. అంతేకాదు ప్రశాంత్ ఉరఫ్ పండు తనకు మంచి స్నేహితుడనీ, అతడు మంచివాడనీ కితాబిచ్చింది.

తను చనిపోయిన తర్వాత తన బంగారాన్ని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని తెలిపింది. ఇంకా ప్రశాంత్ కార్డుతో 4 వేల రూపాయల షాపింగ్ చేశాననీ, ఆ డబ్బు అతడికి తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ సందేశం తన మెయిల్ బాక్స్‌కు వెంటనే రాలేదని నీలిమ భర్త సురేష్ చెపుతున్నాడు.

నీలిమ పేర్కొన్న ప్రశాంత్ ఎవరో సురేష్‌కు తెలుసుననీ, నీలిమ బర్త్ డే ఫంక్షన్‌కు అమెరికా వెళ్లినప్పుడు ఆమె ప్రశాంత్ తన స్నేహితుడంటూ పరిచయం చేసిందని పోలీసులు చెపుతున్నారు. కానీ అంతకు మించి వివరాలు తనకు తెలియని సురేష్ అంటున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇదిలావుంటే నీలిమకు పెళ్లికి ముందే ప్రేమ ఉన్నదనీ, పెద్దలు ఒత్తిడి చేసి సురేష్‌తో ఆమెకు పెండ్లి చేశారని వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత నీలిమ భర్త వద్ద ఉన్నది చాలా తక్కువనీ, అతడు లేకుండానే యూఎస్‌లో ఉండివచ్చిన నీలిమ, ఈ దఫా తన వెంట భర్త కూడా బయలుదేరడాన్ని అంగీకరించలేక ప్రాణం తీసుకున్నదన్న వాదనలు వినబడుతున్నాయి.

ఈ నేపధ్యంలో దర్యాప్తును ఆపేయాలని కుటుంబ సభ్యులు కోరిన మీదట పోలీసులు ఆపేస్తారో... లేదంటే చివరికంటా శోధించి ఆమె ఆత్మహత్యకు అసలు కారణాలేమిటన్నది తేలుస్తారో చూడాలి.

Published Date: 2012-08-06 12:17:04 GMT

Related News