| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

సెప్టెంబర్‌లో ప్రభాస్‌, మాస్‌ డైరెక్టర్‌ రాఘవ లారెన్స్‌ల 'రెబల్‌'

 

'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'తో సూపర్‌హిట్‌ కొట్టిన యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, 'కాంచన'తో సూపర్‌హిట్‌ కొట్టిన మాస్‌ డైరెక్టర్‌ రాఘవ లారెన్స్‌ల సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావులు నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్‌' నిర్మాణం పూర్తి కావచ్చింది.

ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు మాట్లాడుతూ - ''ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో వేసిన మూడు భారీ సెట్స్‌లో ప్రభాస్‌, తమన్నా, 30 మంది డాన్సర్స్‌ పాల్గొనగా ఆరు రోజులపాటు రామజోగయ్యశాస్త్రి రాసిన 'ఓరి నాయనో నువ్వెంత గొప్పవాడురో.. నువ్వెంత పెద్ద వాడురో.. నువ్వెంత మంచి వాడురో..' పాటను చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నాం. ఈ పాటతో ప్యాచ్‌వర్క్‌ మినహా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది.

ఈనెల మూడవవారంలోనే ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నాం. నాలుగో వారంలో ఆడియో రిలీజ్‌ చేస్తాం. సెప్టెంబర్‌లో వరల్డ్‌ వైడ్‌గా 'రెబల్‌' చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మా బేనర్‌లోనే కాదు ప్రభాస్‌ కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. ప్రభాస్‌ అభిమానుల్లో ఈ చిత్రం పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రేక్షకులు ప్రభాస్‌ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అన్ని అంశాలూ ఇందులో వుంటాయి. ప్రభాస్‌లాంటి పెద్ద స్టార్‌తో తీస్తున్న 'రెబల్‌' చాలా పెద్ద హిట్‌ అవుతుంది. రాఘవ లారెన్స్‌ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో అద్భుతంగా తీస్తున్నారు. అన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌కు ధీటుగా ఎంతో ప్రెస్టీజియస్‌గా 'రెబల్‌' చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అన్నారు.

యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్‌ శంకర్‌, విశాల్‌, ఆకాష్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న 'రెబల్‌' చిత్రానికి మాటలు: డార్లింగ్‌ స్వామి, ఫోటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్‌: బుజ్జి, కిరణ్‌, నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్‌.

Published Date: 2012-08-09 14:40:00 GMT

Related News