"గీతాంజలి" ఈ పేరు వినగానే నాగార్జున హీరోగా మణిరత్నం రూపోందించిన ఓ అద్భుత వెండితెర ప్రేమ కావ్యం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం అప్పట్లోని ప్రేమ కథలలో ఎంతటి ట్రెండ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈ చిత్రాన్ని అధిగమించాలని వచ్చిన చిత్రాలు "నా హృదయంలోనిదురించే చెలి", "ఓయ్", నిన్నటి "అందాల రాక్షసి" దాకా .. అన్నీ చతికలపడ్డాయి.
నాగార్జునను అందరి హృదయాల దగ్గరకు తీసుకెళ్ళిన చిత్రం గీతాంజలి. మరో సారి నాగార్జునతో అలాంటి గీతాంజలిని మించిన సినిమా తీయగలనంటున్నాడు నేటి దర్శకుడు శేఖర్ కమ్ములా.
గీతాంజలిని చూసిన రోజే నాగార్జున గారితో ఒక రొమాంటిక్ ప్రేమ కావ్యాన్ని తీయాలనుకున్న. ఇప్పటికీ ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. కథాపరంగా ఇంకా నిర్ణయంచకున్నప్పటికీ నాగార్జున ఒక్కసారి ఒకే అంటే ఇక సర్వం సిద్ధమైనట్లే. మరో మారు నాగార్జునను లవర్‌బోయ్‌ని చేస్తానని శేఖర్ కమ్ములా ధీమాతో చెపుతున్నాడు. ప్రస్తుతం ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. Published Date: 2012-08-15 09:19:46 GMT
|