| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

"మిల్కీ బ్యూటీ" నాకన్నా అందగత్తె.. అందుకే రెస్పెక్ట్ ఇస్తా: తాప్సీ

 

ఈ మధ్యెందుకో మన రింగురింగుల జుట్టున్న తాప్సీ భయంకర నిజాలు మాట్లాడుతోందట. తనకి తాను ఇలా చెప్పడం గొప్ప అనుకుంటుందేమో అంటున్నారు ఆమె చెప్పే నిజాలు విని తట్టుకోలేని వారు. తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ అయినప్పటికీ తనను పొరపాటున కదిలిస్తే చుక్కలు చూపెడుతుందంటున్నారు.

ఈ మధ్య జరిగిన "సంతోషం సినీ అవార్డ్‌" కార్యక్రమంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఆ కార్యక్రమంలో ఒక సీనియర్ నటి తాప్సీకి ముక్కుసూటి ప్రశ్న వేసిందట. ఆ ప్రశ్న ఏంటయా అంటే... "మీరు మీకన్నా సీనియర్లైన వారిని ఎందుకు గౌరవించట్లేద"ని.

దీనికి తాప్సీ స్పందిస్తూ... తను మిల్కీ బ్యూటీ తమన్నాను తప్ప ఇంకెవర్ని గౌరవించబోను, తమన్నా ఒక అద్భుత నటి మాత్రమే కాదు తను చాలా అందంగా ఉంటుందని తాప్సీ సమాధానమిచ్చిందట. ఈ సమయంలో తమన్నా కూడా తాప్సీ పక్కనే ఉందట. పక్కనున్న వారిని ఉబ్బెయ్యడం అనే ఫార్ములా తాప్సీ ప్రయోగిస్తుందేమో అని అనుకుంటున్నారట ఇది విన్న జనం. తాప్సీకి కాకా పట్టడం భలేగా తెలుసంటున్నారు టాలీవుడ్ సినీజనం.

Published Date: 2012-08-16 15:10:08 GMT

Related News