మెగా ఫ్యామిలీ వరుస హిట్లతో మెగాఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. మొన్నటి'రచ్చ', నిన్నటి ' గబ్బర్ సింగ్' నేటి 'జులాయి' అన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్లతో మెగా ఫ్యాన్స్‌కు పండుగ చేస్తున్నాయి. ఐతే ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన మనుషులు చూసన తర్వాత పవన్ ఫ్యాన్స్ వణికిపోతున్నారట.
ఎందుకలా వణికిపోతున్నారయా అంటే.. వాళ్లు ఇలా సెలవిస్తున్నారట. దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని తలాతోకా లేకుండా తీసి, పూరీ ఇలాక్కూడా చిత్రాన్ని తీస్తారా అని నిరూపించారు. ఇప్పుడు అదే పంచ్‌ను కెమేరామెన్ గంగతో రాంబాబుపై వేస్తారేమోనని భయంగా ఉందని అంటున్నారట.
అభిమానుల పరిస్థితి ఇలావుంటే చిత్రంలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న గంగ(తమన్నా)తో రాంబాబు(పవన్ కల్యాణ్) పరిస్థితి కూడా అలాగే ఉందట. దేవుడు చేసిన మనుషులు చిత్రం చూసిన దగ్గర్నుంచి వాళ్లకు నిద్రపట్టడం లేదట.
దేవుడు చేసిన మనుషులు బాక్సాఫీసు దగ్గర మోకాళ్లు చీరుకుపోతూ బోల్తా పడటంతో పవన్ కల్యాణ్ అభిమానులు మా గంగతో రాంబాబును ఏం చేస్తారోనని బెంబేలెత్తిపోతున్నారట. పూరీ చిత్రాలన్నీ 25 రోజులకే అటకెక్కేస్తుండటంతో ఇదే కోవలో పవన్ చిత్రం చేరుతుందేమోనని బెంగెట్టుకున్నారట. మరి పూరీ గంగతో రాంబాబుకు హిట్ హిట్ హుర్రే ఇస్తారో... దేవుడు చేసిన మనుషులు షాకిస్తారో చూడాలి. Published Date: 2012-08-17 14:19:33 GMT
|