ఈమధ్య హీరోయిన్లు డ్రీమ్‌గర్ల్స్‌లా ఉండటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువగా యోగా చేస్తున్నారు. బందరు లడ్డూలా ఉండే పంజాబీ భామ చార్మికి ఇప్పుడు అవకాశాలు పెద్దగా లేవు.
ప్రస్తుతం మలయాళంలో 'తపన' అనే చిత్రం చేస్తోంది. అలాగే హిందీలో ఓ చిత్రం చేస్తోంది. అయితే పబ్లిసిటీ కోసమో ఏమోకానీ.. ఇప్పుడు తాను యోగా చేస్తూ ఎరోబిక్ చేస్తూ వీడియోలు తీయించుకుంది.
అలా తీయించుకున్న వీడియోలు దాచుకోకుండా వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేసింది సెక్సిణి షెర్లిన్ చోప్రాలా. అవి చూసిన సినీజనం చార్మికి షెర్లిన్ చోప్రాలా ట్విట్టర్ పిచ్చి పట్టుకున్నదని లోలోన గొణుక్కుంటున్నారట.
ఈ వీడియోలు చాలా హాట్‌గా ఉండటంతో దానికి క్రేజ్ ఏర్పడింది. ఈ విన్యాసాలు ఏ మేరకు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాల్సిందే. Published Date: 2012-08-17 14:22:14 GMT
|