| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

నక్సలిజం వ్యాప్తికి నితీష్ కుమారే కారణం!: లాలూ ప్రసాద్

 

బీహార్‌లో నక్సలిజం వ్యాప్తి చెందడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్య కారణమని రాష్ట్రీయ జనతా దళ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనే తీరే ప్రధాన కారణమని లాలూ ప్రసాద్ దుయ్యబట్టారు.

పాట్నాలో విలేకరులతో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నితీష్ కుమార్ హయాంలో మూడింటిలో రెండో వంతుగా నక్సలిజం పెరిగిపోయిందని ఆరోపించారు.

నక్సల్స్‌‌కు సీఎం నితీష్ కుమార్ లొంగిపోయారని ధ్వజమెత్తారు. సమాజంలో అహింసను ఏమాత్రం సహించేది లేదని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇంకా నక్సలైట్లు తీవ్రవాదాన్ని వీడి, శాంతియుత బాట పట్టాలని లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపు నిచ్చారు.

Published Date: 2010-07-16 03:26:10 GMT

Related News